ఉచిత వైద్య శిబిరంను సద్వినియోగం చేసుకోండి

అంబర్‌పేట్, సెప్టెంబర్ 7 (స్పెషల్ ఎడిషన్): ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాగ్‌ అంబర్‌పేట్‌ ఆజాద్‌నగర్‌లో ఎన్‌సీడీ (అంటువ్యాధులు కాని వ్యాధులు) స్క్రీనింగ్‌ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఆరోగ్య పరిస్థితిపై వైద్య సలహాలు, అవసరమైన సూచనలు అందించారు. ముఖ్యంగా ఎన్‌సీడీలను...