ఏపీకి రైల్వే గిఫ్ట్
ఏపీ బ్యూరో, మే 05; (స్పెషల్ ఎడిషన్): విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆనందాన్ని కలిగించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖను కేంద్రంగా చేసుకుని ఈ కొత్త జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక రైల్వే...