కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు పరిస్థితులు విద్యుత్‌, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం – మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు

ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, అక్టోబర్ 18 (స్పెషల్ ఎడిషన్): కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దలేక చేతులెత్తేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా అవినీతి, కమీషన్లు, వాటాల వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ, సాగునీరు, విద్యుత్ పరిస్థితులపై ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల...