జన్మనిచ్చి.. జనారణ్యంలో విడిచి!
-శంషాబాద్ రాళ్లగూడలో రోడ్డుపై నవజాత శిశువు కలకలం -పసికందు ఏడుపు విని రక్షించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం -ఆసుపత్రికి తరలించి చికిత్స.. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం -సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాపను వదిలేసిన వారి కోసం ముమ్మర గాలింపు శంషాబాద్, జూలై 22 (స్పెషల్ ఎడిషన్): కన్న పేగు బంధాన్నే మరచిపోయేలా చేసిన హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో బుధవారం వెలుగుచూసింది. జన్మనిచ్చిన కొద్ది గంటలకే ఓ నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై అనాథలా వదిలేసి...