తెలంగాణ టెక్ విజన్
-అన్ని విద్యా స్థాయిల్లో ఏఐ ప్రవేశపెట్టేందుకు కమిటీ ఏర్పాటు -రఘురామ్ రాజన్ సలహాలతో రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు -స్కిల్స్ యూనివర్సిటీలు, ఏటీసీల అభివృద్ధిపై దృష్టి -పెట్టుబడుల ఆకర్షణకు పారిశ్రామిక విధానాల ప్రాధాన్యం -స్టార్టప్‌ల ప్రోత్సాహంతో ఉద్యోగ అవకాశాల విస్తరణ సింధు, స్పెషల్ కరస్పాండెంట్: మే 06; (స్పెషల్ ఎడిషన్) హైదరాబాద్‌లో జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర చర్చలు జరిపారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, సాంకేతిక మరియు వైద్య విద్య సిలబస్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...