దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు–కంటైనర్ ఢీ పలువురికి తీవ్ర గాయాలు.. కోదాడ ఆస్పత్రికి తరలింపు సూర్యాపేట జిల్లా బ్యూరో/బ్రేకింగ్ న్యూస్, ఆగస్టు 26 (స్పెషల్ ఎడిషన్):  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, దుర్గాపురం స్టేజి సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు....