నిరాశకు నై.. సునీల్ కు జై.!
-దివ్యాంగతను జయించి కూరగాయల వ్యాపారంతో జీవన పోరాటం -చిన్న బండిపైనే పది రకాల కూరగాయలు విక్రయిస్తూ ఆదర్శంగా సునీల్ -పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న యువకుడిపై స్థానికుల ప్రశంసలు రంగారెడ్డి జిల్లా, జూన్ 29 (స్పెషల్ ఎడిషన్): శారీరక వైకల్యం జీవితానికి అడ్డంకి కాదని, కష్టపడాలనే సంకల్పం ఉంటే ఏ పరిస్థితినైనా అధిగమించవచ్చని తుర్కయంజాల్ కమ్మగూడకు చెందిన దివ్యాంగుడు సునీల్ తన జీవన ప్రయాణంతో నిరూపిస్తున్నాడు. ఎలాంటి ప్రభుత్వ సహాయం, ఆర్థిక అండ లేకపోయినా తన కష్టాన్నే పెట్టుబడిగా మార్చుకుని చిన్న కూరగాయల వ్యాపారాన్ని...