పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల వినతుల స్వీకరణ
-ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశం -ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ సూర్యాపేట, జూన్ 8 (స్పెషల్ ఎడిషన్): సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారి (ఎస్పీ) నరసింహ ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించి వాటిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, మోసాలు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను...