ప్రజా తీర్పుకు సిద్ధమేనా?
"కష్టపడింది ప్రజలు.. క్రెడిట్ కొట్టేది మీరు.. ఇక ఆ నాటకాలు సాగవు" - భాజపా సీనియర్ నాయకులు కాసోజు శంకరాచారి ఘాటు విమర్శలు నేరడ/చిట్యాల, జూన్ 15 (స్పెషల్ ఎడిషన్): నేరడ–గాదిరెడ్డిపల్లె అనుసంధాన వంతెన అంశాన్ని కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రచారానికి, రాజకీయ మనుగడకు వేదికగా మార్చుకోవడం దురదృష్టకరమని భాజపా సీనియర్ నాయకులు కాసోజు శంకరాచారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "రెండు సంవత్సరాల క్రితమే అధికారులు, శాఖలను సంప్రదించామని గొప్పలు చెప్పుకునే వారు నిజంగా అంత చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఈరోజు గ్రామ ప్రజలు...