SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 11:33 am Posted by : SPECIAL EDITION DAILY

మల్కాజిగిరి డంపింగ్ యార్డ్ సమస్యపై సీఎం వద్ద అఖిలపక్ష వినతి

హైదరాబాద్, మే 05; (స్పెషల్ ఎడిషన్)
మల్కాజిగిరి బాలాజీ నగర్‌లో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ సమస్యపై బీజేపీ నాయకులు మరియు అఖిలపక్ష ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్శారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న చెత్త నిల్వ, దుర్వాసన, ఆరోగ్య సమస్యల గురించి వివరంగా ప్రస్తావించినట్లు సమాచారం. సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిందిగా సీఎంను కోరారు. ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులతో చర్చించి అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి, దానికి ఈటెల రాజేందర్ను అధ్యక్షుడిగా నియమించి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.ఎస్.ఆర్ పాల్గొన్నారు.