రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, ఆగస్టు 23 (స్పెషల్ ఎడిషన్): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జి. జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ఇరు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం ఇప్పుడు తేటతెల్లమైందని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండా కన్నేపల్లి...