వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కిన భీమిడి ఎల్లారెడ్డి
వారసత్వంలో గౌరవం కావాలంటున్న కురు వృద్ధుడు మూడు సంవత్సరాలుగా వృద్ధాశ్రమంలోనే జీవనం తల్లిదండ్రులను చివరి దశలో ఆదుకోవాల్సిన బాధ్యత వారసత్వానిదే.. వనస్థలిపురం, సెప్టెంబర్ 8 (స్పెషల్ ఎడిషన్): “జీవితాంతం కష్టపడ్డాను... నా వాళ్ల కోసం సంపాదించాను... పావలా ఉన్నదాన్ని రూపాయి చేశాను. చివరికి ఆ రూపాయి కూడా నా చేతిలో లేకుండా పోయింది. కన్నబిడ్డలు, మనవళ్లు ఉన్నా అనాథలా మిగిలాను. నాకు కావాల్సింది ఆస్తి కాదు... నా వారసత్వం నుంచి గౌరవం, ఆప్యాయత, చివరి రోజుల్లో ఒక నీడ కావాలి...” అంటూ ఓ కురువృద్ధుడు కన్నీటి...