విద్యార్థుల కోసం పోరాటం ఆగదు: ఆంజనేయ చారి
ఫార్మా-డి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి ఎల్బీనగర్, జూన్ 6 (స్పెషల్ ఎడిషన్): ఫార్మా-డి విద్యార్థుల హక్కులు, ఉద్యోగ అవకాశాల కోసం తన పోరాటం కొనసాగుతుందని కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ నాయకుడు ఆంజనేయ చారి స్పష్టం చేశారు. ఫార్మా-డి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మే 29న హస్తినాపురం నుంచి ప్రజాభవన్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించగా, పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే తన ఉద్యమాన్ని అక్కడితో ఆపకుండా జూన్ 5న ప్రజాభవన్‌కు...