విశ్వకర్మ ఉద్యమం… వేదికలకే పరిమితమా?
-సమాజానికి మాటలు కాదు... మార్పు కావాలి "ఒక సమాజాన్ని వెనుకబాటుకు నెట్టేది ప్రత్యర్థులు మాత్రమే కాదు... ప్రశ్నించలేని నాయకత్వం కూడా." ఈ వాక్యం నేడు విశ్వకర్మ సమాజ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న ప్రశ్న. రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ సంఘాలు, కమిటీలు, సమాఖ్యలు, సేవా సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి నెలా సభలు... సదస్సులు... సన్మానాలు... తీర్మానాలు... ఐక్యత సమావేశాలు... ఆత్మీయ సమ్మేళనాలు... ఎక్కడ చూసినా ఉద్యమ వాతావరణమే కనిపిస్తోంది. కానీ ఆ ఉద్యమ ఫలితం ఎక్కడ? వేదికలు పెరిగాయి... కానీ వృత్తులు...