సకాలంలో చికిత్స.. ప్రాణ రక్షణ

-అత్యాధునిక శస్త్రచికిత్సతో రోగికి పునర్జన్మ ఇచ్చిన యశోద వైద్యులు -సమయానికి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని సూచన నల్లగొండ, జూన్ 19 (స్పెషల్ ఎడిషన్): అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి సైతం బయటపడవచ్చని యశోద మలక్‌పేట్ హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతికత, నిపుణులైన వైద్య బృందం సమన్వయంతో క్లిష్టమైన కేసులను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. గురువారం నల్లగొండలోని శాలిని హోటల్‌లో నిర్వహించిన విలేకరుల...