SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 7:20 pm Posted by : SPECIAL EDITION DAILY

సామాజిక సేవలకు గౌరవ డాక్టరేట్

రేవల్లె మదన్ (మస్తాన్)కు ప్రతిష్టాత్మక పురస్కారం

పెద్ద అంబర్‌పేట్/అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 30 (స్పెషల్ ఎడిషన్): సమాజ సేవలో విశేష కృషి చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, పెద్ద అంబర్‌పేట్ కలానగర్‌కు చెందిన ట్రీస్ సొసైటీ చైర్మన్ రేవల్లె మదన్ (మస్తాన్) కు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరిలో శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. తమిళనాడు న్యాయవ్యవస్థ మాజీ న్యాయమూర్తి, యూనివర్సిటీ డైరెక్టర్ డా. కె. వెంకటేశన్ ఈ పురస్కారాన్ని రేవల్లె మదన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందిన పి.ఆర్. శంపత్, ఐఏఎస్ పాల్గొన్నారు. అలాగే యూనివర్సిటీ ఇండియా కంట్రీ డైరెక్టర్ సుకుమార్, డిప్యూటీ డైరెక్టర్ విజయ్ మోహన్, యూనివర్సిటీ రీజినల్ జాయింట్ డైరెక్టర్ గౌని నర్సింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేవల్లె మదన్ తన ట్రీస్ సొసైటీ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సమాజ సేవా రంగంలో చురుగ్గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి శిక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం, ఉచిత ఆరోగ్య శిబిరాలు, స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, విద్యా మరియు వైద్య సేవలు, బాలల హక్కుల పరిరక్షణతో పాటు పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. నిస్వార్థంగా సమాజ సేవ చేసే వారికి ఎప్పుడైనా, ఎక్కడైనా సముచితమైన గౌరవం లభిస్తుందనే విషయాన్ని ఈ పురస్కారం మరోసారి నిరూపించిందని పలువురు పేర్కొన్నారు. సమాజాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సంక్షేమం కోసం రేవల్లె మదన్ అందిస్తున్న విశేష సేవలను గుర్తించి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఈ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.