సామాజిక సేవలకు గౌరవ డాక్టరేట్

రేవల్లె మదన్ (మస్తాన్)కు ప్రతిష్టాత్మక పురస్కారం పెద్ద అంబర్‌పేట్/అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 30 (స్పెషల్ ఎడిషన్): సమాజ సేవలో విశేష కృషి చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, పెద్ద అంబర్‌పేట్ కలానగర్‌కు చెందిన ట్రీస్ సొసైటీ చైర్మన్ రేవల్లె మదన్ (మస్తాన్) కు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరిలో శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో...