సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇన్విటేషన్ కార్డుపై రగడ.!?
ఈటల శ్రేణుల ఆగ్రహం!.. వివరణ ఇవ్వాలంటున్న అభిమానులు? స్థానికుల ఉద్యోగాలపై ఆరోపణలు..మౌనం పై ఎందుకంటూ ప్రశ్నలు వనస్థలిపురం, సెప్టెంబర్ 26 (స్పెషల్ ఎడిషన్): వనస్థలిపురం-చింతలకుంటలో అక్టోబర్ 1న సినీ ప్రముఖుల సమక్షంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ 45వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ సంస్థ విడుదల చేసినట్లు చెబుతున్న ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ పరంగా స్థానిక మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫోటో ఆహ్వాన పత్రికలో లేకపోవడంపై ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు తీవ్ర...