హమాలీలకు కూలీ రేట్లు పెంచాలి.. రైతులకు సౌర విద్యుత్‌తో ఆదాయం పెరగాలి

అబ్దుల్లాపూర్ మెట్టు, మే 07 (స్పెషల్ ఎడిషన్): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలో గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్‌లో హమాలీల సమస్యలు, రైతులకు విద్యుత్ పథకాలపై అవగాహన కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు హమాలీ కార్మికులు కూలీ రేట్ల పెంపు కోసం సిఐటియు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డికి వినతిపత్రం అందజేయగా, మరోవైపు రైతులకు సౌర విద్యుత్ పథకాలపై అవగాహన కల్పిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు...