హయత్‌నగర్‌కు నూతన సీఐగా శంకరయ్య బాధ్యతల స్వీకరణ

హయత్‌నగర్, జూన్ 19 (స్పెషల్ ఎడిషన్): హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా శంకరయ్య శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ బదిలీ అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు హయత్‌నగర్ సీఐగా విధులు నిర్వహించిన పల్సా నాగరాజ్ గౌడ్‌ను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, సీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న శంకరయ్యను హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టి...