హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో దేశభక్తిని చాటుకోవాలి

ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ సూర్యాపేట జిల్లా బ్యూరో, ఆగస్టు14 (స్పెషల్ ఎడిషన్):  స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు...