అంబర్‌పేట్, సెప్టెంబర్ 7 (స్పెషల్ ఎడిషన్): ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాగ్ అంబర్‌పేట్ ఆజాద్‌నగర్‌లో ఎన్‌సీడీ (అంటువ్యాధులు కాని వ్యాధులు) స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఆరోగ్య పరిస్థితిపై వైద్య సలహాలు, అవసరమైన సూచనలు అందించారు. ముఖ్యంగా ఎన్‌సీడీలను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధుల తీవ్రతను తగ్గించవచ్చని వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రజలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. స్థానికంగా నిర్వహించే ఇలాంటి ఆరోగ్య శిబిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో), జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు, వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం ప్రమీల, ఆశా వర్కర్లు దేవి, శోభ, రజిత, లావణ్య తదితరులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఉచిత వైద్య శిబిరంను సద్వినియోగం చేసుకోండి
0
14
Previous article
