ePaper
Wednesday, August 5, 2026
ePaper
HomeతెలంగాణGHMCకుబేర కలెక్షన్... కొనుగోలుదారుల సెలెక్షన్

కుబేర కలెక్షన్… కొనుగోలుదారుల సెలెక్షన్

📰 Generate e-Paper Clip

– కొత్తపేటలో కుబేర సిల్క్స్ వస్త్ర ప్రపంచం ఐదవ శాఖను ప్రారంభించిన సినీ నటి నిహారిక

– సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలే లక్ష్యం

– మహిళలు, పురుషులు, చిన్నారుల కోసం విస్తృత శ్రేణిలో ప్రత్యేక కలెక్షన్లు

– ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చిన ప్రజలు… ప్రత్యేక ఆఫర్లకు విశేష స్పందన

ఎల్బీనగర్/కొత్తపేట, జూలై 18 (స్పెషల్ ఎడిషన్): కొత్తపేటలో కుబేర సిల్క్స్ వస్త్ర ప్రపంచం ఐదవ శాఖ శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆధునిక హంగులతో, విశాలమైన షోరూమ్‌గా తీర్చిదిద్దిన ఈ నూతన వస్త్ర ప్రపంచాన్ని ప్రముఖ సినీ నటి, టీవీ యాంకర్, నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ఆహ్వానితులు భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు. ప్రారంభం నుంచే షోరూమ్ వినియోగదారులతో కిక్కిరిసిపోవడం విశేషంగా నిలిచింది.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, “కుబేర వస్త్ర ప్రపంచం ఐదవ శాఖగా కొత్తపేటలో ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరల్లో అందించడం నిజంగా అభినందనీయమైన విషయం. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్త్రాలు ఒకే చోట లభించేలా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ప్రజల ఆదరణను తప్పకుండా పొందుతుంది” అని అన్నారు. వినియోగదారుల నమ్మకమే ఏ వ్యాపార సంస్థకైనా అతిపెద్ద బలమని, అదే విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ కుబేర వస్త్ర ప్రపంచం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం కుబేర సిల్క్స్ వస్త్ర ప్రపంచం డైరెక్టర్ శాలిని మాట్లాడుతూ, వినియోగదారుల విశ్వాసమే తమ విజయానికి పునాది అని పేర్కొన్నారు. కొత్తపేటలో ప్రారంభించిన ఈ ఐదవ శాఖను అత్యాధునిక సౌకర్యాలతో, విశాలమైన షాపింగ్ వాతావరణంతో తీర్చిదిద్దామని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకుని నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా సరసమైన ధరలకు వస్త్రాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రతి పండుగ, ప్రతి శుభకార్యం, ప్రతి కుటుంబ వేడుకకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా కలెక్షన్లను సిద్ధం చేశామని వివరించారు. మహిళల కోసం పట్టు చీరలు, డిజైనర్ చీరలు, ట్రెండీ డ్రెస్సులు, పురుషుల కోసం సంప్రదాయ మరియు ఆధునిక వస్త్రాలు, చిన్నారుల కోసం ఆకర్షణీయమైన దుస్తులు, యువత కోసం ఫ్యాషన్ కలెక్షన్లు, వివాహ వేడుకలకు ప్రత్యేక వస్త్ర శ్రేణులు, రోజువారీ వినియోగానికి అనువైన దుస్తులు ఇలా అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునే విధంగా విస్తృత శ్రేణి వస్త్రాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నాణ్యత, అందుబాటు ధరలు, వినియోగదారులకు మర్యాదపూర్వక సేవలు అందించడమే తమ సంస్థ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు, ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించడంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో షోరూమ్‌ను సందర్శించి కొనుగోళ్లు చేశారు. ప్రారంభమైన తొలి రోజే విశేష స్పందన లభించడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. కొత్తపేటతో పాటు ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్ పరిసర ప్రాంతాల ప్రజలకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ నూతన శాఖ మరింత చేరువ కానుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, మహిళలు, యువత, వినియోగదారులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక సదుపాయాలు, విశాలమైన పార్కింగ్, నాణ్యమైన వస్త్రాల సమాహారం, అందుబాటు ధరలు, ప్రత్యేక ఆఫర్లతో కొత్తపేటలో ప్రారంభమైన కుబేర సిల్క్స్ వస్త్ర ప్రపంచం స్థానిక వస్త్ర వ్యాపార రంగంలో మరో విశ్వసనీయ చిరునామాగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!