ePaper
Friday, October 30, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ - సూర్యాపేట పెరిక భవన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ...

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ – సూర్యాపేట పెరిక భవన్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుక

📰 Generate e-Paper Clip

 

ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, అక్టోబర్ 18 (స్పెషల్ ఎడిషన్):

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని సూర్యాపేట పట్టణ పెరిక సంఘం అధ్యక్షుడు పత్తిపాక వేణుధర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పెరిక భవన్‌లో ఆదివారం పెరిక సంఘం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని, పూలను పూజిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే ఈ పండుగ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. పెరిక సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం ఇదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం సమీప చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి, ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గౌరమ్మ ఆశీస్సులతో కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం మహిళలు పత్తిపాక వీరమ్మ, పోతురాజు సుజాత, పిన్నేని అనిత, పత్తిపాక ప్రమీల, జూకూరి గీత, ధన్యాకుల సరిత, అంకతి ఉపేంద్ర, జుట్టుకొండ నాగలక్ష్మి, బందు మమత, ధన్యాకుల రజిత, పిన్నని వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!