ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeతెలంగాణసకాలంలో చికిత్స.. ప్రాణ రక్షణ

సకాలంలో చికిత్స.. ప్రాణ రక్షణ

📰 Generate e-Paper Clip

-అత్యాధునిక శస్త్రచికిత్సతో రోగికి పునర్జన్మ ఇచ్చిన యశోద వైద్యులు

-సమయానికి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చని సూచన

నల్లగొండ, జూన్ 19 (స్పెషల్ ఎడిషన్):

అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి సైతం బయటపడవచ్చని యశోద మలక్‌పేట్ హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతికత, నిపుణులైన వైద్య బృందం సమన్వయంతో క్లిష్టమైన కేసులను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. గురువారం నల్లగొండలోని శాలిని హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యశోద మలక్‌పేట్ హాస్పిటల్ ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి, డాక్టర్ కళాధన్, గుత్తా డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన ఉయ్యాల నరసింహ అనే వ్యక్తి ప్రాణాలను కాపాడిన విధానాన్ని వివరించారు. పది రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న నరసింహ పలు ఆస్పత్రులను ఆశ్రయించినప్పటికీ సమస్యకు సరైన నిర్ధారణ జరగలేదని తెలిపారు. అనంతరం మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌కు వచ్చిన రోగిని ప్రత్యేక వైద్య బృందం సమగ్రంగా పరిశీలించి వివిధ రకాల పరీక్షలు నిర్వహించిందన్నారు. ఆ పరీక్షల్లో రోగి పరిస్థితి అత్యంత ప్రమాదకర దశలో ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. రోగిలో పేగు సంబంధిత వ్యాధి తీవ్రస్థాయికి చేరుకోవడంతో పాటు కిడ్నీలపై కూడా ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీకమ్ భాగంలో పేగు చీలిక, ఇన్‌ఫెక్షన్ ద్రవం పేరుకుపోవడం, అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం కనిపించిందని చెప్పారు. పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి అత్యాధునిక పద్ధతుల్లో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. వైద్యుల సమన్వయం, ఆధునిక పరికరాలు, ఐసీయూ సిబ్బంది అప్రమత్తత కారణంగానే రోగి ప్రాణాలను కాపాడగలిగామని వారు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని మల్టీ డిసిప్లినరీ క్రిటికల్ కేర్ బృందం పర్యవేక్షణలో ఉంచి ప్రత్యేక చికిత్స అందించామని చెప్పారు. బయాప్సీ, హిస్టోపథాలజీ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా చికిత్స అందించడంతో ఆరోగ్యం వేగంగా మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలస్యం చేస్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. మలక్‌పేట్ యశోద హాస్పిటల్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల బృందం అందుబాటులో ఉందని, క్లిష్టమైన కేసులకు కూడా తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. సమయానికి చికిత్స తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!