ePaper
Saturday, June 20, 2026
ePaper
HomeతెలంగాణGHMCహయత్‌నగర్‌కు నూతన సీఐగా శంకరయ్య బాధ్యతల స్వీకరణ

హయత్‌నగర్‌కు నూతన సీఐగా శంకరయ్య బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

హయత్‌నగర్, జూన్ 19 (స్పెషల్ ఎడిషన్):

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా శంకరయ్య శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ బదిలీ అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు హయత్‌నగర్ సీఐగా విధులు నిర్వహించిన పల్సా నాగరాజ్ గౌడ్‌ను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, సీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న శంకరయ్యను హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టి స్టేషన్ పరిపాలనను స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన సీఐ శంకరయ్యకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, పెండింగ్ కేసులు, ప్రజా సమస్యలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ శంకరయ్య మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణతో పాటు ప్రజలకు వేగవంతమైన మరియు పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజలు పోలీస్ శాఖపై నమ్మకం ఉంచి తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. హయత్‌నగర్ ప్రాంతంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు పోలీసు సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!