ePaper
Thursday, July 2, 2026
ePaper
Homeజాతీయంఫుల్ ట్యాంక్‌కు ఫుల్ ఫ్రీడమ్..!

ఫుల్ ట్యాంక్‌కు ఫుల్ ఫ్రీడమ్..!

📰 Generate e-Paper Clip

-జులై 1 నుంచి పెట్రోల్, డీజిల్ పంపిణీపై అన్ని ఆంక్షల ఎత్తివేత

-దేశవ్యాప్తంగా బంకులకు నిరంతరాయ ఇంధన సరఫరాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

-నిల్వలు, సరఫరా సాధారణ స్థితికి చేరడంతో కీలక నిర్ణయం

-వినియోగదారులకు కొరత లేకుండా ఇంధనం అందేలా చర్యలు

హైదరాబాద్, జూన్ 29 (స్పెషల్ ఎడిషన్):

ప్రభుత్వం, జులై 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఆధ్వర్యంలోని అన్ని రిటైల్ అవుట్‌లెట్లలో ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగనుండగా, వినియోగదారులు కొరత భయాలు లేకుండా అవసరమైన మేరకు ఇంధనం పొందే అవకాశం ఏర్పడింది. రవాణా, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇంధన సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడంతో దేశవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియలో వేగం పెరగనుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!